Reading Time: < 1 minute
Dorothy Teaser Karthik Subbaraj Keerthy Suresh Film Releases Sept 25

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం డొరోతి’. రెట్రో ప్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ చాలా కాలంగా తెరకెక్కించాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ టీజర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తుండగా, సనంత్, రిషికాంత్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావక్కరసు విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ ఎమోషనల్ కథకు ‘ఇసైజ్ఞాని’ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందించడం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.గునీత్ మోంగా, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రఖ్యాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శితం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.