Reading Time: < 1 minute

పాస్ బుక్ లో పేరు మార్చడం కోసం లంచం… ఏసీబీకి చిక్కిన జీపీవో రాజేష్..

Caption of Image.

జగిత్యాల జిల్లాలో మరో అవినీతి ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మెట్ పల్లి మండలం ఆత్మకూరులో జీపీవోగా పనిచేస్తున్న రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.గురువారం ( ఆగస్టు 6 ) ఆత్మకూరు పంచాయితీ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీల్లో రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు జీపీవో రాజేష్.

గ్రామానికి చెందిన మల్లేష్ పట్టాదారు పాస్ బుక్ లో పేరు మార్పిడి కోసం సంప్రదించగా రాజేష్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు మల్లేష్. మల్లేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ALSO READ : అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయలేదు: జోగిని శ్యామల

మల్లేష్ తన తండ్రి దగ్గర నుండి రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేయగా.. పట్టదారు పాస్ బుక్ లో తన పేరుతో పాటు తండ్రి పేరు ఉండడంతో దానిని మార్చడం కోసం జిపిఓ రాజేష్ ను సంప్రదించాడు.మెట్ పల్లి మండల ఆఫీసులో పేరు మార్పిడికి సంబంధించిన ఫైళ్లను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.