Reading Time: 2 minutes

తిరుగుబాటు మొదలైంది : E20 పెట్రోల్ బంద్ చేయాలంటూ అసెంబ్లీ తీర్మానం

Caption of Image.

E20 పెట్రోల్ పై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. E20 పెట్రోల్ వాడకాన్ని నిషేధిస్తూ  పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేశారు.  ఈ పెట్రోల్ వాడకంతో వాహనాలకు నష్టమని, ఖర్చుల భారంకూడా పెరుగుతోందని వస్తున్న వార్తల క్రమంలో పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. E20 పెట్రోల్ వాడితో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపేవరకు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

E20 పెట్రోల్ పై ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. E20 పెట్రోల్ తో  తమ వాహనాల ఇంజిన్ పాడవుతుందని, మైలేజ్ పోతుందని , ఈ పెట్రోల్ వాడకంతో నష్టమే తప్పా లాభం లేదని దేశవ్యాప్తంగా  ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో  E20 పెట్రోల్ ను బంద్ చేయాలని తొలిసారి పంజాబ్  అసెంబ్లీలో తీర్మానం చేశారు. E20 పెట్రోల్ తో వాహనాలకు ఎటువంటి సమస్యలు లేవని తేలేవరకు , ఆ పెట్రోల్ వాడకాన్ని నిషేంధించాలని సభలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు .
  
E20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాహనాల దారులు వెంటనే పెట్రోల్ ను నిషేధించాలని  సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. E20 పెట్రోల్ పై పార్లమెంటులో ప్రతిపక్షాలు గళమెత్తాయి.  ఢిల్లీ మాజీ సీఎం, ఆఫ్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా  E20 పెట్రోల్ పై ప్రధాని మోదీ ఇంటిముందు నిరసన తెలిపేందుకు  ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై నే కూర్చొని ఆందోళన చేశారు. అదే రోజుపంజాబ్ ప్రభుత్వం E20 పెట్రోల్ ను  బంద్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. 

వాస్తవానికి 2030లో పెట్రోల్  లో 30 శాతం ఇథనాల్ కలిపాలని ప్రతిపాదన ఉంది.. ఇందుకు భిన్నంగా E20 విధానాన్ని ముందుగానే ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆప్ నేతలు. 

►ALSO READ | యాక్సిడెంట్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు మృతి : మూడేళ్లల్లో ఫ్యామిలీ మొత్తం చిన్నాభిన్నం

అమెరికాను సాకు గా  చూపి దేశ ప్రజలు వాహన వినియోగదారుల ప్రయోజనాలను పణం పెడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రపంచ ఇథనాల్ లో 60 శాతం  అమెరికా వినియోగిస్తోందని భారత్ కేవలం 5 శాతం మాత్రమే ఉత్పత్తి  చేస్తోందని హైలైట్ చేయడం ప్రజలను మోసం చేయడమే అని ఆరోపించారు. 

E20 పెట్రోల్ వినియోగంతో వాహనాలు దెబ్బతినడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. పెరిగిన నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చుల తో సాగు, సరుకుల రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రూవ్ అయ్యే వరకు E20 పెట్రోల్ వాడకాన్ని నిలిపివేయాలని ఈ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది పంజాబ్ ప్రభుత్వం.

©️ VIL Media Pvt Ltd.