
రాజమండ్రిలో దారుణం జరిగింది. పార్కింగ్ విషయంలో గొడవ కారణంగా ఓ మహిళా డాక్టర్ తలపై కారు ఎక్కించారు దుండగులు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న 28ఏళ్ళ ప్రియాంక రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్య మాల్ లో సినిమా చూసేందుకు వెళ్ళింది. అక్కడ పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు ప్రియాంకతో గొడవకు దిగారు. సినిమా అయిపోయాక స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను వెంబడించి కారుతో గుద్ది చంపేశారు.
ముందు వెళ్తున్న స్కూటీని కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో కారు ఆమె తలపై నుంచి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తలపై కారు ఎక్కడంతో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
HORRIFIC: In Rajahmundry, GSL Medical College student Priyanka (28) was declared brain-dead in Hyderabad after 2 drunk youths hit her scooty and ran their car over her head. This followed a parking row on Aug 3 near Prasaditya Mall. Prakash Nagar police held both suspects. pic.twitter.com/vPiKuHgb0t
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 6, 2026
ALSO READ : కరీంనగర్ జిల్లాలో విషాదం.. గుండెపోటుతో SBI బ్యాంకులోనే రైతు మృతి
మెరుగైన చికిత్స కోసం ప్రియాంకను హైదరాబాద్ కు తరలించగా ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ దగ్గర జరిగిన వివాదం మనసులో ఉంచుకొనే ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.