
సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. కొంతమంది భామలు దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను పంచుకున్నారు. అయితే, ఇప్పుడు బుల్లితెర రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, సీరియల్ నటి రోహిణి సంచలన వ్యాఖ్యల చేశారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను వెల్లడించి, బుల్లితెర వర్గాల్లో కలకలం రేపారు. రోహిణి, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత, సీరియల్స్‌తో పాపులర్ అయిన తన రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ధైర్యంగా బయటపెట్టారు.
ఇది కూడా చదివేసేయండి : స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు
ఆమె బీటెక్ చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు ఆసక్తి పెరిగి సీరియల్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని రోహిణి స్పష్టం చేశారు.ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ఒక సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతలను కలవడానికి వెళ్ళినప్పుడు, ఏకంగా ఇద్దరు వ్యక్తులు ఆమెను “కమిట్‌మెంట్” అడిగారు. వారి డిమాండ్ వినగానే అక్కడి నుండి వెంటనే వచ్చేసినట్లు రోహిణి తెలిపారు. ఆ తర్వాత మరో ఆడిషన్‌లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని, అప్పుడు వయసులో చాలా పెద్ద వ్యక్తి ఒకరు అవకాశం ఇస్తాను నాకేమి ఇస్తావ్.? అంటూ నేరుగా అడిగాడని రోహిణి తెలిపారు.
ఇది కూడా చదివేసేయండి : ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
ఇటువంటి అవమానకరమైన సంఘటనలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించి, ఇప్పుడు నలుగురు మెచ్చుకునే స్థితికి చేరుకున్నానని రోహిణి ధీమా వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాదని, టీవీ రంగంలో కూడా ఉందనే విషయం ఉత్తరాదిన జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఇప్పటికే రుజువైందని రోహిణి పేర్కొన్నారు. దక్షిణాదిన ఇలాంటి ఘటనలు బయటపడిన సందర్భాలు తక్కువే అయినా, టీవీ పరిశ్రమలోనూ ఇది ఉందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ అనేది దాదాపు ప్రతి రంగంలో ఉన్నప్పటికీ, గ్లామర్ ఫీల్డ్‌లో ఇది కాస్త ఎక్కువగా ఉందని రోహిణి అభిప్రాయపడ్డారు. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ధైర్యంగా బయటపెట్టిన రోహిణి, కమిట్‌మెంట్ అడిగిన ఆ వ్యక్తుల వివరాలను లేదా ఛానెళ్ల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇక రోహిణి విషయానికొస్తే ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోలతో పాటు సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది రోహిణి.
ఇది కూడా చదివేసేయండి : తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.