Reading Time: < 1 minute

వ్యాన్ కింద పడి బాలుడు మృతి..పహాడీషరీఫ్ పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలో ఘటన

Caption of Image.

ఓల్డ్‌‌‌‌సిటీ, వెలుగు: అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వ్యాన్ కింద పడి రెండున్నరేళ్ల బాలుడు రవితేజ మృతిచెందాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. వ్యాన్ ముందు బాలుడు ఉన్న విషయాన్ని డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పహాడీషరీఫ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.