Reading Time: < 1 minute

అసంఘటిత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

Caption of Image.

ముషీరాబాద్, వెలుగు: అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం 23వ ఆవిర్భావ సభ వ్యవస్థాపక అధ్యక్షుడు కామల్ల ఐలన్న అధ్యక్షతన జరిగింది.

ఇందులో పాల్గొనోన దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాలని కోరారు. వారి పిల్లలకు విద్య, వైద్యం అందేలా చూసి, ఇంటి స్థలం కేటాయించాలన్నారు.  ఎమ్మెల్సీ ఎల్.రమణ , సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయి కుమార్, కోశాధికారి తాటికొండ మధు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.