
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాభవన్‌లో మంగళవారం నుంచి కొత్త మీ సేవ సెంటర్సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, మీ-సేవ డైరెక్టర్ రవికిరణ్ ప్రత్యేక మీ-సేవ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకునేందుకు, ఇతర సర్టిఫికెట్ల కోసం ఈ సెంటర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాగా, ప్రజావాణికి 321 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో పంచాయతీరాజ్ 144, రెవెన్యూ 51, హోంశాఖ 25, ఇతర ఫిర్యాదులు 99 ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్త కంటిన్జెన్సీ పోలీసు ఉద్యోగుల 18 నెలల వేతనాల బకాయిలపై స్పందించిన చిన్నారెడ్డి.. డీజీపీ సీవీ ఆనంద్‌తో ఫోన్ లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.