
Lava Probuds Xplore 25° TWS: భారత మార్కెట్లో లావా (LAVA) నుండి Probuds Xplore 25° ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను లాంచ్ అయ్యింది. ఈ ఇయర్‌బడ్స్‌లో ఎప్పుడు లేని విధంగా 1.69 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లేను ఛార్జింగ్ కేసుపై అందించారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోకుండానే అవసరమైన సమాచారాన్ని నేరుగా కేసుపైనే చూసేయచ్చు. ఇంకా అంతేకాకుండా పాప్-అప్ డిజైన్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, క్వాడ్ మైక్ ENC వంటి ఫీచర్స్ దీని సొంతం.
1.69 అంగుళాల డిస్‌ప్లే:
Lava Probuds Xplore 25°లో 1.69 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను ఛార్జింగ్ కేసులోనే అందించారు. దీనివల్ల బ్యాటరీ స్థాయి వంటి కీలక సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యేక పాప్-అప్ ఫిడ్జెట్ మెకానిజం (Pop-Up Fidget Mechanism) డిజైన్ ఈ ఇయర్‌బడ్స్‌కు స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
50 గంటల బ్యాటరీ:
ఈ కొత్త TWSను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మొత్తం 50 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుంది.
10mm డ్రైవర్లు, Quad Mic ENC :
ఈ TWSలో 10mm డైనమిక్ డ్రైవర్లు ఉండటంతో స్పష్టమైన ఆడియో, బలమైన బాస్ అనుభూతి లభిస్తుంది. కాల్స్ సమయంలో మెరుగైన వాయిస్ క్లారిటీ కోసం క్వాడ్ మైక్రో ఫోన్ సెటప్ తో పాటు ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సలేషన్ (ENC) టెక్నాలజీని అందించారు. దీంతో చుట్టూ శబ్దం ఎక్కువగా ఉన్నా కాల్స్ స్పష్టంగా వినిపిస్తాయి.

ఇంకా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని 35ms లో లాటెన్సీ గేమింగ్ మోడ్ ను అందించారు. ఇది ఆడియో డిలేను తగ్గించి గేమింగ్ సమయంలో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో పాటు డ్యూయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్ ఉంది. దీని ద్వారా ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
నీటి చినుకుల నుంచి రక్షణ:
రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని IPX4 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్‌ను అందించారు. దీంతో చెమట లేదా తేలికపాటి నీటి చినుకుల వల్ల ఇయర్‌బడ్స్‌కు ఇబ్బంది ఉండదు. అలాగే లావా సంబంధిత Over-the-Counter Replacement (OTCR) సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.
ధర:
వీటి ధరను రూ.1,999గా నిర్ణయించారు. ఇవి కాస్మిక్ బ్లాక్, చార్‌కోల్ గ్రే, ఐవరీ వైట్ రంగుల్లో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
Lava Probuds Xplore 25° ముఖ్య స్పెసిఫికేషన్స్:
1.69 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే,
Pop-Up Fidget డిజైన్,
10mm డైనమిక్ డ్రైవర్లు,
క్వాడ్ Mic + ఎంసీ,
35ms లో లేటెన్సీ గేమింగ్ మోడ్,
బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ,
డ్యూయల్ డివైజ్ పేరింగ్,
మొత్తం 50 గంటల బ్యాటరీ బ్యాకప్,
10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్,
IPX4 వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్,
రంగులు: కాస్మిక్ బ్లాక్, చార్‌కోల్ గ్రే, ఐవరీ వైట్.