Reading Time: < 1 minute
Ather Konark Electric Scooter Launch On August 29 Expected Price Features

Ather Konark: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్తగా చౌకైన స్కూటర్‌ను తీసుకురాబోతోంది. ‘‘ఏథర్ కోనార్క్’’ ఆగస్టు 29న విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటి వరకు విక్రయించిన స్కూటర్లలో ఇదే అత్యంత చౌకైన మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఏథర్ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. ఈ స్కూటర్‌తో మాస్ మార్కెట్ విభాగంలో మరింత బలంగా అడుగుపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ తయారు చేయనున్న మొదటి ప్రొడక్షన్ మోడల్. మోడల్ విడుదల చేసిన తర్వాతే దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది.

డిజైన్ పరంగా కోనార్క్‌లో హ్యాండిల్‌బార్‌పై హెడ్‌ల్యాంప్, ముందు భాగంలో పూర్తి వెడల్పుతో LED DRLs, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సింగిల్-పీస్ సీటు, సన్నని LED టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. టాప్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లో పాలిమర్ బాడీకి బదులుగా మెటల్ బాడీ ప్యానెల్స్‌ ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్మాణం వల్ల మరింత బలంగా, మన్నికగా ఉండే అవకాశం ఉంది.

ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ప్రకారం.. కొత్త EL ప్లాట్‌ఫామ్ అందుబాటు ధర, సౌకర్యవంతంగా ఉండే డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చు, ఈజీ ఛార్జింగ్, మెరుగైన రీసేల్ విలువ, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏథర్ కోనార్క్ ధర రూ. 1 లక్ష లోపే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.