Reading Time: < 1 minute
RRB నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆగస్ట్ 6: భారతీయ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఈ ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ షార్ట్‌ నోటిఫికేషన్ (CGL 04/2026) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4,098 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు వయసు తప్పనిసరిగా 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14, 2026వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులను సెప్టెంబర్‌ 13, 2026వ తేదీ వరకు స్వీకరిస్తారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆన్‌లైన్‌ రాత పరీక్షలు స్టేజ్‌1, స్టేజ్‌ 2, ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.35,400తోపాటు నిబంధనల మేరకు ఇతర అలవెన్స్‌లను కూడా అందిస్తారు. రీజనల్‌ వారీగా పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, విభాగాల వారీగా విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ వంటి ఇతర వివరాలు పూర్తి నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • వివరణాత్మక పూర్తి నోటిఫికేషన్‌ విడుదల తేదీ: ఆగస్ట్‌ 13, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఆగస్ట్ 14, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2026.
  • సీబీటీ 1 ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: త్వరలో వెల్లడి

ఆర్‌ఆర్‌బీ రైల్వే జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.