Reading Time: < 1 minute

ఇంజినీరింగ్ చేశారా ? NTPCలో భారీగా ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు.. మిస్సవకండి..

Caption of Image.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్​టీపీసీ) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్. 

మొత్తం ఖాళీలు: 135.

విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 40, మెకానికల్ 55, కంట్రోల్ & ఇనుస్ట్రుమెంటేషన్ 40. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ & ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పవర్ ప్లాంట్/ పవర్ సెక్టార్ రంగంలో నిర్దిష్ట సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఆగస్టు 20. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ntpc.co.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.