Reading Time: < 1 minute

మీకు తెలుసా : ఇక నుంచి డయల్ 112.. డయల్ 100 కాదు.. ఎందుకంటే..!

Caption of Image.

తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకు మనం ఎమర్జెన్సీ కోసం వేర్వేరు నంబర్లకు కాల్ చేసేవాళ్లం.  కానీ ఇకపై ఆ అవసరం లేదు. అత్యవసర సేవలన్నింటికి 112 కు మాత్రమే కాల్ చేయాలి. 

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) ఆధ్వర్యంలో  మన రక్షణకు భరోసాగా నిలిచే’NextGen Dial-112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ను రాష్ట్ర డీజీపీ  సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు.ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు… ఇలా అన్ని రకాల అత్యవసర సేవలకు కేవలం ఒక్కటే నంబర్…112

రోడ్డు ప్రమాదాలు జరిగినా, నేరాలు సంభవించినా, అగ్నిప్రమాదాలు ముంచెత్తినా లేదా వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినా… క్షణం ఆలస్యం లేకుండా 112కు కాల్ చేయండి. ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే… కాల్ రాగానే కాలర్ ఉన్న ఖచ్చితమైన లొకేషన్ ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. వెంటనే ఆ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న పోలీస్, ఫైర్ లేదా మెడికల్ రెస్పాన్స్ టీమ్‌లను అప్రమత్తం చేసి, క్షణాల వ్యవధిలో సహాయం అందిస్తారు.

సంవత్సరంలో 365 రోజులు, రోజులో 24 గంటలు… అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానమైన ఈ వ్యవస్థ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటానికి నిరంతరం పనిచేస్తుంది.

©️ VIL Media Pvt Ltd.