Reading Time: < 1 minute
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్..  వరుసగా మూడు రోజులు సెలవులు..

 

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల విద్యార్థులకు ఈ నెల వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో సెలవులు ఉండటంతో విద్యార్థులు లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించనున్నారు.

ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉన్నాయి. ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సెలవుల జాబితాలో బోనాలు ఉన్నప్పటికీ, విద్యాసంస్థలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

ఆగస్టు 10న హైదరాబాద్‌లో బోనాల మహోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

లాంగ్ వీకెండ్‌కు ప్రయాణాల ప్లాన్

వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో చాలామంది కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు, మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఆగస్టు నెలలో తెలంగాణలోని పాఠశాలలు, విద్యాసంస్థలకు మొత్తం 11 రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. వీటిలో ఐదు ఆదివారాలు, మూడు ఆప్షనల్ సెలవులు, మూడు సాధారణ సెలవులు ఉన్నాయి.

ఈ నెల ప్రధాన సాధారణ సెలవులు:

ఆగస్టు 10 – బోనాలు (విద్యాసంస్థలకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 26 – ఈద్ మిలాద్-ఉన్-నబీ

బోనాల సెలవుపై విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత రానుంది.