Reading Time: < 1 minute

మూడు జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా యు. రమేశ్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాకు డి. గిరివర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశంను నియమించారు. పార్టీ బలోపేతం దిశగా అధిష్టానం ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.