
- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు నోరు జారితే ఖబర్దార్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయి హెచ్చరించారు. గురువారం గాంధీ భవ న్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం రేవంత్‌పై అడ్డగోలు మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు.
ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్, నిజామాబాద్‌లో ఉన్నా.. తమ పార్టీ కార్యకర్తలు వదలరని, రోడ్డుపై ఉరి కించి కొడ్తారని హెచ్చరించారు. అరర్వింద్కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని అధికార పార్టీ ఎంపీగా ప్రధానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.