
ఈ వారం ప్రారంభంలో కొంత నెమ్మదించిన బులియన్ మార్కెట్లు గడచిన రెండు రోజులుగా దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పుంజుకోవటంపై రిటైల్ కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇన్వెస్టర్లకు ఇది వరం లాగా కనిపిస్తున్నప్పటికీ చాలా మంది గోల్డ్, సిల్వర్ కంటే వేరే పెట్టుబడి మార్గాలకు వెళ్లటం కనిపిస్తోంది. ఈ సమయంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ అమ్మకపు ధరలను పరిశీలించటం బెటర్.
ఆగస్టు 6న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.289 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 973గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 725గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 6, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.