
తిరుపతి, ఆగస్ట్ 5: ఈ ఏడాది జూన్ నెలలో 25.26 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రూ. 128.29 కోట్ల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి వచ్చింది. గత ఏడాది జూన్ నెలతో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో హుండీ ఆదాయం రూ. 8.44 కోట్లు పెరిగింది. టీటీడీ లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ నెల హుండీ ఆదాయం 7.04 శాతం పెరిగింది. ఇక గత జూలై నెల ఆదాయం టీటీడీ చరిత్ర లోనే సరికొత్త రికార్డు నెల కొల్పింది. రికార్డులను బ్రేక్ చేసింది. ఈ ఏడాది జూలై నెలలో రికార్డు స్థాయికి చేరుకుంది. గత రికార్డులను బ్రేక్ చేసిన వెంకన్న హుండీ ఆదాయం జూలై నెలలో రూ. 140.28 కోట్లుగా నమోదైంది.
జూలై నెలలో 1 నుంచి 31 వరకు 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం మాత్రం రికార్డ్ స్థాయిలో టిటిడి కి దక్కింది. హుండీ ద్వారా రూ. 140.28 కోట్ల ఆదాయం రాగా జూలై నెలలో 16వ తేదీ అత్యధికంగా రూ. 5.31 కోట్ల కానుకలు టీటీడీకి లభించింది. నెలలో మొత్తం 5 సార్లు రూ. 5 కోట్లకు పైగా ఆదాయం టిటిడికి శ్రీవారి హుండీ ద్వారానే ఆదాయం వచ్చింది. ఇక 21 రోజులు రూ. 4 కోట్లకు పైగా కానుకలు వెంకన్న హుండీ ద్వారా ఆదాయం లభించింది. జూన్ నెల కంటే జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా ఆదాయం మాత్రం రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషం. ఇక గతేడాది జూలై నెలలో 23.76 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా రూ. 129.45 కోట్ల కానుకలు టీటీడీకి దక్కాయి. దీంతో గతేడాది కంటే ఎక్కువగానే కాకుండా ఏకంగా గతం లో ఎన్నడూ రానంత హుండీ ఆదాయం ఈ ఏడాది జూలైలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి దక్కింది.
లడ్డు సేల్స్ లోనూ అదే దూకుడు..!
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో రికార్డు స్థాయిలో లడ్డూలను తయారుచేసి భక్తులకు అందించింది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచిన టిటిడి ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందుబాటులో ఉంచుతోంది.
ఇక ఈ ఏడాది జూన్ నెలలో 1.27 కోట్ల లడ్డూలను టిటిడి విక్రయించగా జూలైలో 1,30,86,278 లడ్డూలను టీటీడీ విక్రయించింది. 2025 జూలైలో 1,21,10,300 లడ్డూలను తయారుచేసి 1,24,40,082 లడ్డూలను భక్తులకు విక్రయించగా ఈ ఏడాది జూలైలో 1,31,01,900 లడ్డూలను తయారుచేసి 1,30,86,278 లడ్డూలను భక్తులకు విక్రయించింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే లడ్డు ప్రసాదం తయారీ చేసిన టీటీడీ ప్రసాదాల తయారీ, పంపిణీలో సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత సేవలు చేస్తోంది.