Reading Time: < 1 minute

భద్రాచలం- వాజేడుకు రోడ్డుకు రిపేర్ చేయండి..మంత్రి తుమ్మల ఆదేశాలు 

Caption of Image.

భద్రాచలం/వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భద్రాచలం నుంచి వాజేడు అధ్వానంగా ఉన్న రోడ్డుకు తక్షణమే రిపేర్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంజినీర్లను ఆదేశించారు. భద్రాచలం నుంచి వాజేడుకు కారులో వెళ్లిన ఆయన రోడ్డు దుస్థితిని తెలుసుకున్నారు. స్థానికుల నుంచి కూడా అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన గురువారం ఏపీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ మంత్రి బీసీ జనార్ధన్​రెడ్డికి పరిస్థితిని వివరించారు.

భద్రాచలం నుంచి ఎటపాక మండలం మీదుగా తెలంగాణలోని వాజేడు వరకు రోడ్డు వెళ్తోందని, ఆ రాష్ట్రంలో సుమారు 7.8 కి.మీల మేర ఉన్న రోడ్డుకు రిపేర్లు కూడా చేయడం లేదని తెలిపారు. తెలంగాణ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంజినీర్లకు కూడా ఫోన్​ చేసి మాట్లాడారు. భద్రాచలం–-వాజేడు మధ్య రోడ్డును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేలా యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలని ఆదేశించారు.

ఏపీలో ఉన్న 7.8 కి.మీలకు రూ.3.70కోట్లు, ఎటపాక నుంచి చర్ల మండలం సుబ్బంపేట వరకు 56.8 కి.మీలు భద్రాచలం డివిజన్​ పరిధిలో ఉండటంతో ఒక ప్యాకేజీ ద్వారా రూ.67.58కోట్లు కేటాయించారు. సుబ్బంపేట నుంచి వాజేడు వరకు ములుగు డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో ప్యాకేజీ ద్వారా 48 కి.మీల దారికి రూ.44కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా 112.6 కిలోమీటర్లకు రూ.115.28కోట్లతో రిపేర్లు చేయాలని, వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని, లేకపోతే కాంట్రాక్టర్లు మార్చాలని ఆదేశించారు. 

©️ VIL Media Pvt Ltd.