Reading Time: 2 minutes

అప్పులు చేసినోళ్లకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి కాల్ చేసినా.. బెదిరించిన పెద్ద కేసు.. కొత్త రూల్స్ తెలుసుకోండి..!

Caption of Image.

అప్పులు ఉన్నోళ్లకు.. రాబోయే రోజుల్లో అప్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నోళ్లకు.. అప్పులు తీసుకుందామని ఆలోచన చేస్తున్న వాళ్లకు వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇది. అవును.. అప్పు ఇచ్చాం కదా అని రాత్రీ పగలు అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లకు రావటం.. ఫోన్లు చేయటం, బెదిరించటం వంటి చర్యలపై ఆంక్షలు విధిస్తూ.. అప్పులోళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కొత్త నిబంధనలు 2027, జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

దేశ వ్యాప్తంగా అప్పులు తీసుకున్న తర్వాత ఏజెంట్ల నుంచి వస్తున్న బెదిరింపులు, ఫోన్ కాల్స్.. చెల్లింపుల విషయంలో ఆయా ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై.. లక్షల సంఖ్యలో కంప్లయింట్స్ వస్తుండటంతో.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. (RBI). 

ఈ టైంలోనే మాట్లాడాలి.. ఇళ్లకు రావాలి :

>>> అప్పు ఇచ్చినోళ్లు లేదా వసూలు ఏజెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటానికి, ఇంటికి రావటానికి వీలు లేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయొచ్చు లేదా ఇంట్లో లేదా బయట సంప్రదించొచ్చు. 
>>> అప్పు తీసుకున్న వ్యక్తి ప్రత్యేక సమయం కేటాయించినప్పుడు మాత్రమే.. అతని అనుమతితోనే మిగతా సమయాల్లో అనుమతి ఉంటుంది. 
>>> ఇళ్లల్లో పెళ్లి, పేరంటాలు, శుభకార్యాలు లేదా విషాధ ఘటనలు జరిగిన సమయంలో.. లేదా ఇతర సున్నితమైన వ్యక్తిగత అంశాలు ఇళ్లల్లో జరిగిన సమయాల్లో.. అప్పు తీసుకున్న వ్యక్తుల ఇళ్లకు వెళ్లొద్దని.. వాళ్లను సంప్రదించొద్దని స్పష్టంగా చెబుతూ.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది RBI.

రివకరీ ఏజెంట్లపై ఆంక్షలు :

>>> డబ్బులు వసూలు చేసే సమయంలో రికవరీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించకూడదు. భయపెట్టటం, అసభ్యకరమైన భాష వాడటం, బూతులు తిట్టటం వంటివి నిషేధం. 
>>> తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదనే కారణంతో.. అప్పు తీసుకున్న వ్యక్తిని ఫోన్ చేసి బెదిరించటం, పదే పదే ఫోన్ కాల్స్ చేయటం.. పదే పదే ఇంటి దగ్గరకు వచ్చి అల్లరి చేయటం.. గొడవ చేయటం, కుటుంబ సభ్యులను బెదిరించటం వంటివి చేస్తే.. అలాంటి రివకరీ ఏజెంట్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. 
>>> అప్పు సరైన సమయంలో చెల్లించలేదనే కారణంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటాన్ని సీరియస్ గా పరిగణిస్తామని రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చింది ఆర్బీఐ.
>>> ఆన్ లైన్ ద్వారా ఫైనాన్స్ యాప్స్ నుంచి అప్పు తీసుకునే వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. ఫొటోలు మార్ఫింగ్ చేయటం.. ఫేక్ వీడియోలు వారి బంధువులకు పంపించటం, ఆడియో రికార్డులను ఆన్ లైన్ పెట్టటం వంటివి క్రిమినల్ చర్యల కిందకు వస్తాయని గట్టిగా హెచ్చరించింది RBI. 

నోటీసు ఇచ్చిన తర్వాతనే అప్పు తీసుకున్నోళ్లను సంప్రదించాలి : 

అప్పు తీసుకున్న వ్యక్తి.. సరైన సమయంలో చెల్లించని పక్షంలో.. అతన్ని సంప్రదించొచ్చు అని స్పష్టం చేసింది RBI. ఆ సమయంలో కొన్ని నిబంధనలు కొత్తగా తీసుకొచ్చింది. ముందుస్తుగా నోటీసు ఇవ్వాలని.. ఒక రోజు గడువు ఇచ్చిన తర్వాతనే అతని ఇంటికి లేదా ఆఫీసుకు లేదా ఇతర ప్రదేశం ఏదైనా సరే.. అప్పు తీసుకున్న వ్యక్తి చెప్పిన ప్రదేశంలో కలవాలని.. అలా కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు.. నోటీసు లేకుండా వ్యక్తిగతంగా వెళ్లి బెదిరింపులకు పాల్పడితే గట్టిగా చర్యలు తీసుకుంటామని ఫైనాన్స్ ఏజెన్సీలు, రికవరీ ఏజెంట్లు, బ్యాంకులకు కొత్త ఆదేశాలు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

రికవరీ ఏజెంట్ల గుర్తింపు కార్డులు :

అప్పు తీసుకున్న వ్యక్తిని కలిసే రికవరీ ఏజెంట్లు కచ్చితంగా వారి వారి గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆయా బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ జారీ చేసిన నోటీసు చూపించాలి. ఆయా సంస్థల నుంచి తీసుకున్న అప్పుకు సంబంధించి పత్రాలు చూపించాలి. రికవరీ ఏజెంట్ తోపాటు బ్యాంక్ గ్రీవెన్ అధికారి ఒకరు తప్పనిసరిగా ఉండాలి. 

ఇదే సమయంలో ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు విధిగా రికవరీ కాల్స్ రికార్డులను నిర్వహించాలని.. ఆ డేటా మొత్తాన్ని భద్రపరచాలని ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

©️ VIL Media Pvt Ltd.