Reading Time: < 1 minute
Allu Arjun Atlee Raaka Movie Mumbai Shooting Update 2027 Release

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘రాకా’. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇప్పటివరకు ఎలాంటి విరామం లేకుండా ఒకే ప్రాంతంలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటూ టాలీవుడ్‌లోనే ఒక రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్  విఎఫ్‌ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ సౌండ్ స్టేజ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ షూట్ ముందు దుబాయ్, ఇతర అంతర్జాతీయ లొకేషన్లలో ప్లాన్ చేసినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా ఆ షెడ్యూళ్లను రద్దు చేయడం జరిగింది. దీంతో మేకర్స్ తమ పూర్తి దృష్టిని ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌పైనే పెట్టి నాన్‌స్టాప్‌గా షూట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బన్నీ కేవలం చిన్నపాటి విరామాలు మాత్రమే తీసుకుంటూ నిరంతరాయంగా ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా  నటిస్తున్న బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కూడా తన భాగానికి సంబంధించిన షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ముంబై సెట్‌లో సాగుతున్న ఈ భారీ షెడ్యూల్ మరో నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా సాగనుంది. ఈ చిత్రాన్ని 2027లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.