
న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి మెటా సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ క్షమాపణ చెప్పారు. ఫేస్బుక్లో ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో తొలగింపు వ్యహహారంలో జుకర్ బర్గ్ వ్యక్తిగతంగా సారీ చెప్పారు. అలాగే, మెటా నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సీఎస్ఏఎమ్, డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపైన, ప్లాట్ ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకపై వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని.. ప్లాట్ ఫామ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. చైల్డ్ అబ్యూస్, హానికర కంటెంట్‌ను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను మెటా నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్ బుక్ 2026, జూలై 23న దాదాపు ఐదు గంటల పాటు తొలగించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఫేస్ బుక్‌లో ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం జరిగిందని మెటా ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది.
కానీ మెటా వివరణతో కేంద్రం ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు మూడు రోజుల డెడ్ లైన్ విధించింది. లేదంటే ఫేస్ బుక్ సేఫ్ హార్బర్ సెక్యూరిటీని రద్దు చేస్తామని హెచ్చింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో మెటా తలొగ్గింది. ఈ మేరకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారు.
News Alert! Meta CEO Mark Zuckerberg sends his apologies for CSAM, deepfake content, and errors in operating the platform: Sources pic.twitter.com/4BSVk7UQCM
— Press Trust of India (@PTI_News) August 5, 2026