Reading Time: < 1 minute

కాకా విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలి

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని జీఎం ఆఫీస్​ ఏరియాలోని  కేంద్ర మాజీ  మంత్రి కాకా విగ్రహం వద్ద లైటింగ్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ లీడర్లు కోరారు. బుధవారం కాంగ్రెస్​ లీడర్​ కామ విజయ్​ఆధ్వర్యంలో కార్పొరేషన్​ కమిషనర్​ జె.అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. అలాగే కాకా విగ్రహం వద్ద నల్లా కనెక్షన్​ ఇప్పించాలని, ప్రతిరోజూ శానిటేషన్ పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, హకీమ్​, విజయ్ రావు, కృష్ణ, శ్రీనివాస్, రాజు, శేఖర్, సర్దార్​, కల్యాణ్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.