Reading Time: < 1 minute
Jio Rs 319 And Rs 339 Prepaid Plans Offer 18 Month Google Ai Pro 45gb Data Unlimited Calls

Jio Recharge: ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా మారిన రిలయన్స్ జియో (Reliance Jio) నెలవారీ వ్యాలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో రూ.319, రూ.339 ప్లాన్లలో ప్రతిరోజూ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు (గూగుల్ AI ప్రో) Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది.

రూ.319 ప్లాన్:

జియో రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ లో ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో పాటు 18 నెలల పాటు గూగుల్ AI ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100 కాగా.. ఇందులో 5TB (5000GB) గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా JioTV, JioAICloud వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా మాత్రమే ఉన్నందున అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం అందుబాటులో ఉండదు.

రూ.339 ప్లాన్‌:

రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్ లో కూడా ప్రతిరోజూ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, నెలవారీ వ్యాలిడిటీ అందుబాటులో ఉంటాయి. అలాగే 18 నెలల గూగుల్ AI ప్రో, జియోటీవీ, JioAICloud ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్‌కు రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ప్రధాన తేడా రూ.14.95 టాక్‌టైమ్ అదనంగా లభించడం మాత్రమే. మిగతా అన్ని ప్రయోజనాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లో కూడా అన్‌లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉండదు.

రోజువారీ 1.5GB డేటా సరిపడే వినియోగదారులు, ప్రతి నెల ఒకే తేదీన రీచార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఈ రెండు ప్లాన్లు మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా Google AI Pro వంటి ప్రీమియం సేవను ఉచితంగా పొందాలనుకునే వారికి ఈ ప్లాన్లు మరింత విలువను అందిస్తాయి.