Reading Time: < 1 minute
Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??

నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారని నటి రేణు దేశాయ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రజలు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీలను ప్రశ్నించడానికి ధైర్యం చేయరని, కానీ తనను వచ్చి ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. తాను కుక్కలు, ఇతర ప్రాణుల సంక్షేమం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) స్థాపించానని, అందువల్ల తన దృష్టి వాటిపైనే ఉంటుందని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. మనుషుల కోసం NGO పెట్టుకుంటే అప్పుడు మనుషుల గురించి మాట్లాడతానని ఆమె తెలిపారు. ప్రజలకు నిజంగా మానవసేవ గురించి ఆసక్తి ఉంటే, ప్రభుత్వాలను లేదా మనుషుల కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలను ప్రశ్నించాలని ఆమె సూచించారు. మానవసేవ చేసి చేసి, మనుషుల ప్రవర్తనతో విరక్తి చెంది జంతువుల సంక్షేమం వైపు వచ్చానని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్

ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం

ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే