
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూ రో: ప్రజల చెంతకు పాలనను తీసుకురావాలనే లక్షంతో కేసిఆర్ కొత్త జిల్లాలను, కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను తీసుకొచ్చారు. లంబాడీ తండాలను పం చాయతీలుగా తీర్చిదిద్దారు. మీ మంత్రి పొంగులేటి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినట్లు గద్వాల, వనపర్తి, నారాయణపేట జి ల్లాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అ దే జరిగితే ఆయా జిల్లాలో అగ్గిపుట్టిస్తామ ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ స న్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రం ఎలా ఉందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో విశ్లేషణ చేసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అబద్దాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కాడని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. కొత్త పథకాలను అమలు చేయక పోగా ఉన్న పథకాలను ఊడగొట్టాడని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబార్, కెసిఆర్ కిట్, మైనార్టీలు, క్రిష్టియన్లకు ఇచ్చే అన్ని సదుపాయాలను రద్దు చేశాడన్నారు.
వృద్ధ్యాప్య ఫించన్లు కూడా రూ. 4 వేలకు పెంచుతామని చెప్పి మాట మార్చారని ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఓ అబద్ద్ధాల కోరు అని ఆయన మాటలు నమ్మి మోసపోయారని, మరో సారి మోస పోవద్దని చెప్పారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులకు 40 శాతం గెలిపించారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు వారి పతనానికి నిదర్శమని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ. 32 వేల కోట్లు ఖర్చు పెట్టి నార్లపూర్, కర్వేన, ఉదండాపూర్, రిజర్వాయర్లను పూర్తి చేశామని, కాలువల నిర్మాణం తప్ప 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకునే ఆయన ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కనీసంఒ 10 శాతం పనులైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. కెసిఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా ఇరిగేషన్ గా మారిందన్నారు. గతంలో మైగ్రేషన్ జిల్లాగా ఉన్న పాలమూరును కెసిఆర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలను మాగాణిగా చేసి కరువు లేకుండా చేశారన్నారు.
కాంగ్రెస్ హాయంలో పెండింగ్‌లో పడావుగా పడ్డ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క ప్రాజెక్టు అయినా పది శాతం పూర్తి చేయలేదని చెప్పారు. పాలమూరుపై ప్రేమ చూపించే సిఎం మీరు రెండేళ్లలో ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలని సవాల్ విశిరారు. మీరు బిఆర్‌ఎస్ ఆద్వర్యంలో తెచ్చిన పనులకు రిబ్బన్ కటింగ్‌లు తప్ప కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా తెచ్చారని నిలదీశారు. కనీసం పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసే దైర్యం సిఎం కు లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా జలాల హక్కులు మనం తీసుకుంటాము.. మన హక్కు వస్తుంది. కిందికి నీళ్లు పోవు.అక్కడ సిఎం బాస్‌కు నచ్చదు.ఆయన ఒప్పుకోడు. అందుకే ఆ బాస్‌కు నష్టం జరగకూడదని ఉద్దేశ్యంతో ఇక్కడ ఆయనకు చెంచాగాడిలాగా సిఎం వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.ఇప్పటికైనా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రాంమెహ్మన్ రెడ్డి, బిఆర్‌ఎస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.