
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల కు డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా జిఓ ఎంఎస్ నెంబర్ 2లో ఉత్తర్వులు జారీ చేశారు. 3.64 శాతానికి డిఏను ప్రభుత్వం పెంచింది. 2024 జూలై 1నుంచి డిఏ ఉద్యోగులకు అమలు కానుంది. జిల్లా పరిషత్ ము న్సిపాటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచిం గ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ డిఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి పెరిగిన ఈ డిఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించనుంది. దీంతోపాటు జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ డిఏ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపిఎఫ్ ఖాతాల్లో వేయనుంది. 2026 ఏప్రిల్ 30వ తేదీలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30 సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది.
సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను 10 శాతం ప్రాన్ ఖాతాలో జమ చేయనుం ది. మిగతా 90 శాతం బకాయిలను 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లించనుంది. ఇక, పింఛన్‌దారుల కు పెరిగిన డిఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) మొ త్తం (వచ్చేనెల) ఫిబ్రవరి 01వ తేదీన చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్‌దారులకు రావాల్సిన డిఆర్ ఏరియర్స్‌ను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ఈ జిఓలో ప్రభుత్వం పేర్కొంది. ఇక, పార్ట్ టైం అసిస్టెంట్లు, విఆర్‌ఏలకు నెలకు రూ.100లు అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది.ఈ డిఏ పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రుణపడి ఉంటాం: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగులకు డిఏ పెంచుతూ సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో టిజిఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యాం, టిఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్‌లు, ఉద్యోగ సంఘాల నాయకులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అదనపు భారం పడినా సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు, మంత్రులకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. దీంతోపాటు ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకర విషయమని వారు తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కూడా ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.