
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాస్ట్రం సిర్‌మౌర్ జిల్లాలో బస్సులో లోయలో పడింది. హరిపుర్‌ధర్ ప్రాంతంలో బసు అదుపు తప్పి 400 మీటర్ల లోతుగల లోయలో పడడంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 35 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 50 మంది ప్రయాణికులతో బస్సు సోలాన్ నుంచి కుప్వికు వెళ్తండగా ఈ ప్రమాదంలో జరిగింది. ప్రమాదమైన మలుపు వద్దనే ఈ ప్రమాదంలో జరిగినట్టు సమాచారం. గాయపడినలో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయని వైద్యుల వెల్లడించారు. క్షతగాత్రులు, మృతులు సిర్‌మౌర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.