Reading Time: < 1 minute

వాషింగ్టన్: గ్రీన్‌ల్యాండ్ ను రష్యా, చైనా  ఆక్రమించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చర్చల ద్వారా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటామని లేకపోతే అక్కడి  ప్రజలకు నచ్చినా, నచ్చకపోయినా బలవంతంగానైనా ఆక్రమించుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. తాము స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్ లో రష్యా, చైనా ఆక్రమిస్తుందని, పొరుగు దేశాలుగా రష్యా, చైనా ఉండటం తమకు ఇష్టం లేదన్నారు. గ్రీన్‌లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే రష్యా, చౌనా నౌకలు మోహరించి ఉన్నాయని వివరించారు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో వ్యూహాత్మకంగా, రక్షణపరంగా అమెరికా ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కొవడానికి ఆ ప్రాంతం అనేది చాలా ముఖ్యమైందన్నారు.

గ్రీన్‌లాండ్‌పై అమెరికా చర్చలపై డెన్మార్క్ గురువారం స్పందించిన విషయం విధితమే. అత్యంత ప్రధానమైన ఖనిజ సంపన్న అర్కిటిక్ గ్రీన్‌లాండ్ దీవులను అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడంపై కలకలం చెలరేగింది. కాగా వచ్చే వారం ఈ విషయంపై చర్చకు సిద్ధం అని అమెరికా ముందుకు వచ్చింది. ఈ చర్చల ప్రక్రియను డెన్మార్క్ స్వాగతించింది.

వెనెజువెలాలోని కరాకస్ పై అమెరికా సైన్యం దాడి చేసి ఆ దేశపు అధ్యక్షులు నికోలాస్ మదురో బంధించి అమెరికాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కరాకస్‌లోని ఆయన నివాసం నుంచి భార్య సిలియా ఫ్లోరెస్‌తో పాటు అర్థరాత్రివేళ బెడ్‌రూం నుంచి అమెరికా సేనలు ఆయనను పట్టుకువెళ్లాయి.  అమెరికా మాదకద్రవ్యాల నిరోధక చట్టం నిబంధనల మేరకే ఆయనను నిర్బంధం లోకి తీసుకున్నారు. వెనెజువెలాపై కఠిన చర్య అనంతరం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మెక్సికో, క్యూబా, కొలంబియా కూడా అమెరికా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించిన విషయం విధితమే