Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు రాజ్యసభ స్థానాల కు ఈ ఏడాదిలో ఖాళీలేర్పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 2స్థానాలకు ఖాళీలు ఏర్పడనున్నట్లు రాజ్యసభ సచివాలయం శుక్రవారం జా బితా విడుదల చేసింది. తెలంగాణ నుంచి కె.ఆర్. సురేష్‌రెడ్డి (బిఆర్‌ఎస్), అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్)ల పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనున్నది. ఆం ధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగు దేశం పార్టీ నుంచి ఎస్. సతీష్ పదవీ కాలం జూన్‌లో ముగియనున్నది. తెలంగాణ నుంచి రెండే స్థానాలు ఖాళీలేర్పడబోతున్నందున పార్టీల బలబలాలను బట్టి చూస్తే ఆ రెండూ కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకుంటుందని స్పష్టమవుతున్నది. అయితే ప్రస్తుతం బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నందున, ఒక స్థానం ఖచ్చితంగా బిసి అభ్యర్థికి ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రెండో స్థానం అభిషేక్ మను సింఘ్వినే కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తే, రాష్ట్ర కాంగ్రెస్ నేతకు దక్కదు.