
భారతీయ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యే రోజు ఎంతో దూరం లేదు. ఆస్కార్ 2026 లో ఉత్తమ చిత్రం అవార్డుకు పోటీ పడడానికి అర్హత సాధించిన 201 చిత్రాలలో నాలుగు భారతీయ చిత్రాలు ఎంపికయ్యాయి. అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స ఆర్ట్ అండ్ సైన్సెస్ ఈ విషయం ప్రకటించింది. నాలుగు భారతీయ చిత్రాలు కన్నడ బ్లాక్ బాస్టర్ చిత్రం కాంతార -ఎ లెజెండ్ -చాప్టర్ 1, హిందీ చిత్రం తన్వీ ది గ్రేట్, బహుభాషా యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ, తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ, హిందీ చిత్రం బ్రిటన్ – భారతదేశం సహనిర్మాణ చిత్రం రాధికా ఆప్టే నటించిన సిస్టర్ మిడ్ నైట్ ఉత్తమ చిత్రంగా అర్హత పొందిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అకాడమీ గురువారం నాడు 98వ అకాడమీ అవార్డులకు అర్హత కలిగిన నిర్మాణాల రిమైండర్ జాబితాను విడుదల చేసింది. ఉత్తమ చిత్రంతో సహా సాధారణ విభాగాలలో పరిశీలనకు అర్హతా ప్రమాణాలు కలిగిన చిత్రాల జాబితా విడుదలతో మరో ముందడుగు పడింది జనవరి 22న నామినేషన్ల ప్రకటన జరుగుతుంది.
మొత్తం 317 చలనచిత్రాలు 98వ అకాడమీ అవార్డులకు అర్హత పొందాయని అకాడమీ తెలిపింది. వీటిలో 201 చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగంలో పరిశీలనకు అవసరమైన అర్హత సాధించాయి.ఇంతే కాదు అకాడమీ జనరల్ ఎంట్రీ 317 చిత్రాల జాబితాలో ఇతర భారతీయ టైటిల్స్ తో పాటు సహ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవి అకాడమీ అవార్డులలో వివిభ ఇతర విభాగాలలో పరిశీలనకు అర్హత సాధించాయి.ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగానికి భారతదేశపు అధికార ఎంట్రీ – నీరజ్ ఘయ్వాన్ చిత్రం- హోమ్ బౌండ్, దశావతార్ (మారాఠీ) గేవి (తమిళం) ఇండీ మూవీ హ్యూమన్స్ ఇన్ ది లూప్ , డాక్యు- డ్రామా, మహామంత్ర – ది గ్రేట్ చాంట్, భారతదేశం- పాపువా న్యూగినియా సహనిర్మాణం – పాపా బుకా, పేపర్ ఫ్లవర్స్, పారో- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రైడ్ స్లేవరీ వంచి సినిమాలు ఉన్నాయి. రిమైండర్ జాబితాలో చేరినంత మాత్రాన నామినేషన్ గ్యారంటీ గా లభించదు. సినిమాలు ఇప్పటికీ అకాడమీ ఓటింగ్ ప్రక్రియలో పరిశీలింపబడాలి.
కనీసం ఏడు రోజులు ప్రదర్శింపబడాలి
జనరల్ ఎంట్రీ కేటగిరిలలో పరిశీలనకు అర్హత పొందాలంటే 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మద్య ఆ చిత్రాలు లాస్ ఏంజిల్స్ కౌంటీ, న్యూయార్క్ నగరం, బే- ఏరియా, చికాగో, డల్లాస్ – ఫోర్ట్ వర్త్, అట్లాంటా- అమెరికా లోని ఆరు మెట్రో పాలిటన్ ప్రాంతాలలో కనీసం ఒక దానిలో కమర్షియల్ మోషన్ పిక్చర్ థియేటర్ లలో ఫీచర్ ఫిల్మ్ లు ప్రదర్శిచబడి ఉండాలి. అవి ఒకే వేదికలో వరుసగా ఏడు రోజులు ఆడాల్సి ఉంటుందని అకాడమీ తెలిపింది.ఉత్తమ చిత్రంగా పరిగణించబడడానికి ఇంకా పలు షరతులు ఉన్నాయి. సినిమాలు సాధారణ అర్హతా ప్రమాణాలు పూర్తి చేయాలి, గోప్యమైన అకాడమీ ప్రాతినిధ్యం సాధించాలి. చేరిక ఎఁట్రీ ఫారమ్ ను సమర్పించాలి. 2025లో సినిమా విడుదలైన 45 రోజులలోపు 50 యుఎస్ మార్కెట్లలో వరుసగా ఏడు రోజులు థియేటర్ లలో ప్రదర్శించబడడం అవసరం.నాలుగు అకాడమీ ప్రమాణాలలో కనీసం రెండింటినైనా తీర్చినప్పుడే అర్హత మాట.