
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మూవీకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చిన మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారించిన డివిజన్ బెంచ్.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.
కాగా, ఇవాళ(శుక్రవారం) జన నాయగన్ విడుదల కావల్సి ఉంది. అయితే, ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.