
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించి, వాటిని టీ పోల్ అప్‌లోడ్ చేయాలని,ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో ఎన్నికలు జరిగేలా ప్రాథమిక షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 16 మున్సిపోల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసి, 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇసి ప్రణాళికలు చేసినట్లు సమాచారం.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఇసి సమావేశం
ఎస్‌ఇసి కమిషనర్ రాణికుముదిని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12 ప్రచురించనున్నట్లు పార్టీ ప్రతినిధులతో పేర్కొన్నారు. 13న పోలింగ్ స్టేషన్ట వివరాల ముసాయిదాజాబితాను ప్రచురించి, వాటిని టీ పోల్ ఆప్‌లో అప్‌లోడ్ చేసి, ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కమిషనర్ తెలిపారు.