Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ము న్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి 9 జిల్లాల్లో సిఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలకు ప్రణాళికలకు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ బహిరంగ సభల సమ న్వయ బాధ్యత కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. దీంతోపాటు మీనా క్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఈ సభలకు సంబంధించి అగ్ర నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ములుగులో జరి గే బహిరంగ సభకు సోనియా, రాహుల్‌గాంధీలను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఫిబ్రవరి 3న ప్రారంభమై 9వ తేదీన ముగింపు

ఈ బహిరంగ సభల్లో భాగంగా ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపునకు సంబంధించి ఓ వైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్లాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. మొ దటగా ఫిబ్రవరి 3వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ ప్రారంభమై ఫిబ్రవరి 9న ఉమ్మడి జిల్లాల్లో జరిగే బహిరంగ సభలతో అవి ముగియనున్నాయి. దీంతోపాటు మండలాల్లో నిరసన సభలను విస్తృతంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో మండలానికి ఒక్కో కీలక లీడర్ బాధ్యత తీసుకోవాలని పార్టీ సూచించింది.

10 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు

ఈసారి మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉండగా వాటిలో జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ఈ ఫిబ్రవరితో ముగుస్తుంది. మిగతా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది మే వరకు ఉంది.

ఇవి కాకుండా మందమర్రి, మ ణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్ ఏరియాలో ఉన్నా యి. ఈ పది చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడు వు గతేడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల ప రిధిలో 2,630, ఆరు కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డుల ను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్నిచోట్ల కలిపి 52.71లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించింది.