
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను బిగ్ అకాడమీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఆయన విజయవంతమైన ప్రయాణం అకాడమీ విశ్వసించే క్రమశిక్షణ, పట్టుదల ఏకాగ్రతల సమ్మేళనంతో సరిపోల్చదగినదిగా పేర్కొంది. మంగళవారం హైదరాబాద్ లోని నోవోటెల్ హెచ్‌ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్ , బిగ్ టీవీ వ్యవస్థాపకుడు ఛైర్మన్ విజయ్ రెడ్డి , బిగ్ టీవీ మలయాళం వ్యవస్థాపక డైరెక్టర్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయూర్ లతో కలిసి బిగ్ అకాడమీని ప్రారభించారు. ఈ సందర్భంగా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థలో ఆవిష్కరణ జవాబుదారీతనాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. బిగ్ అకాడమీ వ్యవస్థాపకుడు, సిఇఓ రమణ భూపతి మాట్లాడుతూ విద్యా నైపుణ్యాన్ని మానసిక శ్రేయస్సుతో సమతుల్యం చేసే నిర్మాణాత్మక, విద్యార్థి-కేంద్రీకృత విద్యా వ్యవస్థను సృష్టించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతను మానవ మార్గదర్శకత్వంతో కలపడం తద్వారా కేవలం పరీక్షలకు మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో దీర్ఘకాలిక విజయాలకు సిద్ధంగా ఉన్న శిక్షణార్ధులను తయారు చేయడం బిగ్ అకాడమీ- ఐఐటీ జెఇఇ/నీట్ లో తమ లక్ష్యంగా పేర్కొన్నారు. సాంకేతికత-ఆధారిత అభ్యాసం, నిపుణులైన అధ్యాపకులు వ్యక్తిగతీకరించిన విద్యా మార్గదర్శకత్వాన్ని కలపడం ద్వారా విద్యార్ధుల్లో పెరుగుతున్న ఒత్తిడిని పరిష్కరించడం బిగ్ అకాడమీ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. డిజిటల్ పాఠాలు, మూల్యాంకనాలు, పనితీరు ట్రాకింగ్, ఆఫ్‌లైన్ విద్యా మార్గదర్శకత్వాలను అనుసంధానించే వేదికగా తమ హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ నిలుస్తుందన్నారు, కీలక అభ్యాస విభాగాలలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి దాని విద్యావకాశాలను, అలాగే సాంకేతిక సామర్థ్యాలను విస్తరించాలని బిగ్ అకాడమీ యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.