Reading Time: < 1 minute

జమ్మూకశ్మీర్‌లో హిందూ, ముస్లిం విద్యార్థుల తిరంగా ర్యాలీ

Caption of Image.

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సజల్తా ప్రాంతంలో దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్‌ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నిర్వహించిన ఈ ర్యాలీలో యువతులు, స్థానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న సజల్తా లోని రుకయా పబ్లిక్ స్కూల్, మదర్సా జామియా రుకయా లిల్ బనాత్ స్కూల్స్ యాజమాన్యం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని గౌరవ వందనం చేశారు. ముస్లిం, హిందూ విద్యార్థులు కలిసి నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ.. దేశభక్తితో పాటు జాతీయ ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. 

©️ VIL Media Pvt Ltd.