Reading Time: < 1 minute
Nbk112 Budget Issue Is Balakrishna Koratala Sivas Film Shelved Truth Behind Rumors

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జూన్ 25న పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని మొదట ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ విషయంలో నందమూరి బాలకృష్ణ కొంత సంకోచిస్తున్నట్లు ఈ స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి ఆయన ఆలోచిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇక సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాలలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అసలు ఈ విషయంలో వాస్తవాలు ఏంటని ఆరాతీయగా NBK112 ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారంలో నిజం లేదని తెలిసింది. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో  మొకాలుకి సర్జరీ చేయగా షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చారు. బాలయ్య కోలుకున్నాక షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల. అలాగే ముందు అనుకున్న బడ్జెట్ ను కాస్త తగ్గించేలా కూడా సమాలోచనలు చేస్తున్నారట. వన్స్ బాలయ్య షూట్ లో జాయిన్ అయితే ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.