చిలగడదుంపను చూస్తే సాధారణ దుంపలాగే అనిపిస్తుంది కదూ! కానీ దీనిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం నిజంగానే ఇది ఓ ‘విటమిన్ ఎ బాంబ్’ అని ఒప్పుకుంటారు. ముఖ్యంగా నారింజ రంగులో ఉండే దుంపలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్లు కూడా రోజూవారీ ఆహారంలో దీని ప్రాముఖ్యతను గట్టిగా సమర్థిస్తున్నారు. అసలు ఇందులో ఉన్న విటమిన్ల రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం!
తీపి దుంపలో పోషకాల ఖజానా: చిలగడదుంప కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక సాధారణంగా దీనిని స్నాక్‌గా తింటుంటాం. కానీ ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి తో పాటు శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే సహజమైన ఆహారం.
బీటా కెరోటిన్ మ్యాజిక్: నారింజ రంగులో ఉండే చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మనం ఈ దుంపను తిన్నప్పుడు, మన శరీర అవసరానికి తగినట్లుగా ఈ బీటా కెరోటిన్ కాస్త విటమిన్ ఎ గా మారుతుంది. అంటే మన శరీరానికి కావాల్సిన శక్తిని, విటమిన్లను ఇది సహజ సిద్ధంగా అందిస్తుందన్నమాట.

రోజువారీ అవసరానికి మించి విటమిన్ ఎ!: ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే చిలగడదుంప తింటే చాలు… సుమారు 961 మైక్రోగ్రాముల ఆర్ఏఈ విటమిన్ ఎ లభిస్తుంది. ఇక సాధారణంగా పెద్దలకు రోజువారీగా అవసరమయ్యే విటమిన్ ఎ కంటే ఇది చాలా ఎక్కువ. అందుకే దీనిని పోషకాల బాంబ్ అని పిలవడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరోగ్యూనికి బహుళ ప్రయోజనాలు: దీనిని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. ఇక చర్మం మెరిసిపోయేలా చేసేందుకు కూడా ఈ విటమిన్ ఎ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇక మితంగా చిలగడదుంపను తింటూ ఉంటే ఖరీదైన సప్లిమెంట్లు వాడాల్సిన అవసరమే ఉండదు. రోజువారీ డైట్‌లో దీనిని చేర్చుకుని మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి.
గమనిక: మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉంటే, మీ డైట్‌లో పెద్ద మార్పులు చేసే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
The post విటమిన్ A ఇదేనా? చిలగడదుంపలపై నిపుణుల క్లియర్ క్లారిటీ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.