Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం : శ్రావణ మాసం ఈ నెలలో వచ్చే పండగలు.. సెలవులు ఇవే..!

Caption of Image.

హిందువులు  వ్రతాలకు.. పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  ఇక శ్రావణమాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంతా కాదు.  పూజలు.. నోములు.. వ్రతాలు చేసే నెల శ్రావణమాసమే.  ఈఏడాది (2026)   పరాభవనామ సంవత్సరం  శ్రావణమాసం లో   ముఖ్యమైన ఏ పండుగలు ఎప్పుడొచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

మంగళగౌరి వ్రతం ( ఆగస్టు 18, 25, సెప్టెంబర్ 1,8) : నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈమాసంలో ప్రతీ మంగళవారం మంగళగౌరివ్రతం నిర్వహిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్ల పాటు ఈ మాసంలో ప్రతీ మంగళవారం వ్రతం చేస్తారు.

నాగులపంచమి (  ఆగస్టు 17): శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. సర్పదోషాలు తొలగడానికి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు.

వరలక్ష్మీవ్రతం (ఆగస్టు 21) : శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజనుచేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి.. ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆరోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునే వారు ఈ  నెలలోని  శుక్రవారం రోజుల్లో(ఆగస్టు 14,21,28,సెప్టెంబర్ 4)  వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొంటారు. ఈ వ్రతవిధానాన్ని సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.

►ALSO READ | విష్ణువు, శివుడు ఇద్దరు దేవుళ్లకు ఇష్టమైన నెల : ఈ పండుగల శ్రావణ మాసం

రక్షాబంధన్( రాఖీ పండుగ – ఆగస్టు 28):ఈ నెలలో అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం రాఖీ కడతారు. ఇదే రోజుల జంధ్యాల పౌర్ణమి కూడా జరుపుకుంటారు. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి  (సెప్టెంబర్ 4):శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలు నిర్వహించిఉట్లు కొడతారు. చిన్నారులను గోపికలు, కృష్ణులుగా అలంకరించి ఊరేగిస్తారు. ఇలా శ్రావణ మాసాంతం వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. 

పోలాల అమావాస్య (  సెప్టెంబర్ 11): రైతులు పంటలు సమృద్ధిగా పండాలని, పశు సంపద వర్ధిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పోలాల అమావాస్య కూడా ఇదే మాసంలో రావడం విశేషం. ఈ మాసంలో పసుపు రాసుకోవడం, పెసరపప్పు తినడం, పూలు, పత్రితో పూజించడం, పండ్లను, శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్షాకాలంలో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాళ్లు, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం. వంటివాటితో బంధాలు మెరుగుపడతాయి
 

©️ VIL Media Pvt Ltd.