
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆమె తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమత తన సమీప ప్రత్యర్థి.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేల 105 ఓట్ల తేడాతో పరాభవం చవిచూశారు. భవానిపూర్ ఉప ఎన్నికల్లో గెలిచి మమత ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Bhabanipur assembly seat | BJP’s Suvendu Adhikari defeats West Bengal CM Mamata Banerjee by a margin of 15105 votes pic.twitter.com/SWmX8zQGm1
— ANI (@ANI) May 4, 2026
సోమవారం ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు మమత భారీ ఆధిక్యంలో కొనసాగారు. కానీ.. రౌండ్ రౌండ్కు ఆమె ఆధిక్యం కాస్తా కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఏడవ రౌండ్ ముగిసేసరికి.. ఆమె 17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో నిలిచారు. కానీ.. ఆ తర్వాతి రౌండ్లలో ఆ ఆధిక్యం క్రమంగా తగ్గి.. 14వ రౌండ్ నాటికి 4 వేల కంటే తక్కువకు పడిపోయింది. చివరికి పూర్తిగా కనుమరుగైంది.
►ALSO READ | తమిళనాడు ఎన్నికల్లో ఓటమిపై స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్
దక్షిణ కోల్‌కతాలో చాలాకాలంగా తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భవానీపూర్ ఈసారి బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోవడం ఇది రెండవసారి. 2021లో, ఆమె నందిగ్రామ్‌లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో అతని చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ సువేందు అధికారి చేతిలోనే ఆమె ఓటమిని చవిచూశారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంలు ఓడిపోవడం దేశవ్యా్ప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. దేశ రాజకీయాలను నివ్వెరపోయేలా చేసింది. కొలత్తూరు నుంచి పోటీ చేసిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయారు.