
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లక్నో బ్యాటర్లు చెలరేగారు. పూరన్ విధ్వంసం ధాటికి ముంబై బౌలర్లు సరెండర్ అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 రన్స్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్ ఉంచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన లక్నో ఫస్ట్ ఓవర్ నుంచే ముంబైపై అటాక్ కి దిగింది. రెండో ఓవర్లో జోష్ ఇంగ్లిస్ వికెట్ కోల్పోయినప్పటికీ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లు బ్యాట్ జులిపించడంతో భారీ స్కోర్ సాధించింది లక్నో.
లక్నో బ్యాటర్లను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు ముంబై బౌలర్లు.21 బంతుల్లో 8 సిక్సులు, 1 ఫోర్ తో 63 రన్స్ చేసిన పూరన్ విధ్వంసం సృష్టించగా…25 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 44 రన్స్ చేసిన మిచెల్ మార్ష్ రాణించాడు.