Reading Time: 2 minutes

ఎమ్మెల్యేగా రెండు చోట్లా గెలిచిన విజయ్కి ఏ సీటులో ఎంత మెజారిటీ వచ్చిందంటే..

Caption of Image.

చెన్నై: తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ చరిత్ర తిరగరాశారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో 107 స్థానాల్లో గెలిచి సత్తా చాటారు. మ్యాజిక్ ఫిగర్ 118కి 11 స్థానంలో దూరంలోనే టీవీకే పార్టీ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం ఖాయంగానే కనిపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడం కూడా ఖాయం. అయితే.. ఇది మాత్రమే కాదు విజయ్ తను పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచి అదరగొట్టారు. తిరుచిరాపల్లి (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయ్ 27 వేల 416 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

పెరంబూరులో అయితే ఏకంగా 53 వేల 715 ఓట్ల ఆధిక్యంతో గెలిచి విజయ్ రికార్డ్ సృష్టించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి వల్ల కానిది.. కమల్ హాసన్ కలలో కూడా ఊహించనిది, రజినీకాంత్ చేయలేని రాజకీయం విజయ్ చేసి చూపించడం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. తమిళనాడులో 35 శాతం ఓటు షేర్ సాధించి బాక్సాఫీస్ దగ్గరే కాదు పాలిటిక్స్లో కూడా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం. కోటీ 55 లక్షలకు పైగా ఓట్లు విజయ్ టీవీకే పార్టీకి అనుకూలంగా రావడం తమిళనాడులో ఓటర్ల తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుందో చెప్పకనే చెబుతుంది.

►ALSO READ | మమతను మళ్లీ ఓడించిన సువేందు అధికారి.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన టీఎంసీ అధినేత్రి !

విజయ్ పార్టీ డీఎంకే కంచుకోటలను కూడా బద్దలు కొట్టింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను సీఎం సీటు నుంచే కాదు, ఎమ్మెల్యే సీటు నుంచి కూడా విజయ్ పార్టీ దించేసింది.  చెన్నై పరిధిలోని కొలత్తూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన స్టాలిన్.. విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. కొలత్తూరు నియోజకవర్గం కౌంటింగ్ మొత్తం 22 రౌండ్లలో జరుగుతుంది. 9 వేల 122 ఓట్ల తేడాతో టీవీకే పార్టీ అభ్యర్థి స్టాలిన్ను ఓడించారు.

©️ VIL Media Pvt Ltd.