Reading Time: < 1 minute

పేద బిడ్డలను ప్రోత్సహిస్తే.. క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారు : ప్రొఫెసర్ కంచ ఐలయ్య

Caption of Image.

తెలంగాణ పల్లెల్లో ప్రతిభకు కొదవలేదని  సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ప్రపంచ స్థాయిలో రాణిస్తారని  ప్రొఫెసర్ కంచె ఐలయ్య షేపర్డ్ అన్నారు.  హైదరాబాద్‌లోని తెల్లాపూర్ లో  కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ  నూతనంగా నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్  ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

►ALSO READ | 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తం: హరీష్ రావు

తొండలు కూడా గుడ్డు పెట్టని మారుమూల గ్రామం నుంచి వచ్చిన సత్తయ్య సేవా దృక్పథంతో ఎదిగి ఈరోజు ఒక గొప్ప స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ను నిర్మించడం అభినందనీయం. నిరుపేద, దళిత, ఆదివాసీ కుటుంబాల పిల్లలకు క్రీడల్లో అవకాశం కల్పిస్తే.. వారు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తారని ఐలయ్య అన్నారు.  తెలంగాణ గ్రామీణ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ASKES ద్వారా సత్తయ్య అందిస్తున్న విద్య, క్రీడల సేవలు వెలకట్టలేనివన్నారు.  ప్రభుత్వం కూడా సత్తయ్య వంటి సేవకులకు అండగా నిలవాలని ఆయన కోరారు. అలాగే  కాకా వెంకటస్వామి ఆశయాలతో బి.ఆర్. అంబేద్కర్ కాలేజీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.