Reading Time: < 1 minute

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అమర్చిన.. ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతి

Caption of Image.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కాంకేర్ జిల్లాలో శనివారం (మే 2) మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురు జవాన్లు చనిపోయారు. మార్చి 31 న చత్తీస్ గఢ్ ను మావోయిస్టులు లేని రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మావోయిస్టులతో సంబంధం ఉన్న తొలి పేలుడు ఇది. 

నారాయణ్ పూర్ జిల్లాకు ఆనుకొని ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.గతంలో  మావోయిస్టులు అమర్చిన  ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్న క్రమంలో బాంబు పేలి డీఆర్జీ టీంలోని ముగ్గురు చనిపోయారని  ఐజీ బస్తర్ పి సుందర్‌రాజ్ తెలిపారు.

►ALSO READ | స్మార్ట్ మీటర్లు పగిలిపోతున్నయ్.. ఉత్తరప్రదేశ్లో ఊరూరా వ్యాపిస్తున్న మహిళల ఆందోళనలు

©️ VIL Media Pvt Ltd.