Reading Time: 2 minutes

బిగ్ బ్రేకింగ్: యుద్ధం మళ్లీ ఏ క్షణమైనా ప్రారంభం కావొచ్చు.. ఇరాన్ ఆర్మీ ప్రకటనతో హై టెన్షన్..

Caption of Image.

యుద్ధం ముగిసింది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్న క్రమంలో.. ఇరాన్ ఆర్మీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికాతో యుద్ధం తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటూ ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిలీజ్ చేసిన ప్రకటన.. ప్రపంచ దేశాల్లో మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అమెరికాతో యుద్ధం ఏ క్షణమైనా రీ స్టార్ట్ కావొచ్చని ఇరాన్ ఆర్మీ అనౌన్స్ మెంట్‎కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం డిప్యూటీ అధికారి మొహమ్మద్ జాఫర్ అసదీ ఫార్స్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలు, సీజ్ ఫైర్ నిబంధనలను అమెరికా ఉల్లంఘించడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలు కావచ్చొన్నారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు దౌత్య ప్రయత్నాల పట్ల నిజమైన నిబద్ధత కొరవడినట్లు సూచిస్తున్నాయని అన్నారు.

 అమెరికా దుందుడుకు చర్యల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పతనం అయ్యాయని.. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా శతవిధాల ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని.. వాటి ముఖ్య ఉద్దేశం మొదటిది చమురు ధరల పతనాన్ని నివారించడం, రెండవది తాము సృష్టించుకున్న గందరగోళం నుండి బయటపడటమన్నారు.

►ALSO READ | ట్రంప్.. చైల్డ్ కిల్లర్..! యూఎస్ బలగాలు వెంటనే తమ దేశానికి తిరిగి వెళ్లాలి: ఇరాన్

ఇరాన్ సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి ఉద్రిక్తతకైనా ప్రతిస్పందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా ఎలాంటి దాడులు చేసిన అంతే ధీటుగా ఇరాన్ దళాలు కౌంటర్ ఎటాక్ చేస్తాయని హెచ్చరించారు. నెలకు పైగా పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ దశలవారీగా చర్చల ప్రతిపాదనను తీసుకొచ్చింది.

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఏవైనా ఇరాన్ అణు కార్యక్రమ నిరోధం చుట్టే జరగాలని స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉన్నామని, మిడిల్ ఈస్ట్ లో మళ్లీ వార్ట్ స్టార్ కావచ్చని ఇరాన్ దళం హెచ్చరించడంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.