Reading Time: < 1 minute

రూ 10.50 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం

Caption of Image.

పాలకవీడు,  వెలుగు : పాలకవీడు మండలం బెట్టే తండా గ్రామపంచాయతీ సమీపంలోని మూసీ నదిలో రూ 10.50 కోట్లతో చేపట్టిన  చెక్ డ్యాం నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ మాలోత్ బుజ్జి మోతిలాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలకవీడు మండలంలోని గిరిజన రైతుల చివరి భూములను సస్యశ్యామలం చేసేందుకు మూసీ నదిపై  రూ.33.84 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయన్నారు.

ఇందులో భాగంగా నీటి నిల్వలు పెంచేందుకు మూసీ నదిలో చెక్ డ్యాం నిర్మాణానికి మరో రూ.10.5 కోట్లు మంజూరు చేయగా ఆ పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. నిధులు మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గిరిజన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండావత్ కిషన్, వార్డు సభ్యులు బండావత్ సంధ్య నాగేశ్వరరావు, మధు, బండావత్ శివాజీ బండావత్ శ్రీను, మాలోతు విక్రమ్, మాలోతు రమేశ్​ మాలోతు శ్రీను గుత్తేదారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.