Reading Time: < 1 minute

‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ప్రారంభం..హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు

Caption of Image.

ఇబ్రహీంపట్నం, వెలుగు: ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ (ఫాబ్ సిటీ)లోని టీజీఐఐసీ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ జి.సుధీర్ బాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉండటం వల్ల ఈ భవనం రవాణాపరంగా ప్రజలకు ఎంతగానో అందుబాటులో ఉంటుందన్నారు. 

మీర్ ఖాన్​పేట్​లో శాశ్వత భవనం కోసం ప్రభుత్వం 24 ఎకరాల స్థలాన్ని, రూ.25 కోట్ల నిధులను కేటాయించిందని, రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేసి అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. సైబరాబాద్, హైదరాబాద్ తరహాలోనే ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగుతాయన్నారు. 

©️ VIL Media Pvt Ltd.