
- బతుకమ్మ కుంట స్థల వివాదంపై హైడ్రాకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: బతుకమ్మ కుంట స్థల వివాదంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైడ్రాను సుప్రీంకోర్టు ఆదేశించింది. కుంటను యథాతథ స్థితిలో కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావుతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు వెలు వరించింది.
ఆ చర్యలన్నీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఆ నెల 15 న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలను పరిశీలించిన ధర్మాసనం నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.