Reading Time: < 1 minute

టీయూఎఫ్ఐడీసీకి జాతీయ పురస్కారం…అవార్డు అందుకున్న ఎండీ టీకే శ్రీదేవి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్​ఐడీసీ)కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో విశేష కృషి చేసినందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) తమ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించింది.  

ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌‌‌‌లో నిర్వహించిన ‘సంకల్ప దివస్’ వేడుకల్లో భాగంగా టీయూఎఫ్​ఐడీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.