Reading Time: < 1 minute

వరంగల్లో విషాద ఘటన.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Caption of Image.

వరంగల్: వరంగల్లో విషాద ఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ మట్టేవాడ పరిధిలో మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. సంగీత భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు లేఖ రాసి సంగీత ప్రాణం తీసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మట్టేవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత నెలలోనే వికారాబాద్లో కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వికారాబాద్ పట్టణంలోని గంగారాం సాయిబాబా కాలనీకి చెందిన బలిజ దివ్య (26) కోట్‌‌పల్లి పోలీస్ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌‌గా పని చేస్తుండేది. ఆమె ధారూర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటేషన్‌‌పై రైటర్‌‌గా విధులు నిర్వహిస్తుంది. దివ్య తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌‌కు చేరుకున్నారు. 

తండ్రి మరణం తర్వాత కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులతో  కలిగిన మానసిక వేదనే తన మరణానికి కారణమని ఆమె లేఖలో రాసింది. ‘‘నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు. అమ్మా నన్ను క్షమించు’’ అని లేఖలో రాశారు. తన మరణానికి మానసిక ఒత్తిడే కారణమని దివ్య వివరించింది.

©️ VIL Media Pvt Ltd.